Elon Musk Perfume | ప్రముఖ వ్యాపారి ఎలాన్ మస్క్ సేల్స్‌మెన్ అవతారమెత్తాడు. అదేంటి..? కోటీశ్వరుడు సేల్స్‌మెన్‌గా పనిచేయడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారు కదూ..! మీరు చదివింది నిజమే.. తన బోరింగ్ కంపెనీ నుంచి మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త ప్రాడక్ట్ కోసం సేల్స్‌మెన్‌గా అవతారమెత్తాడు. ఇప్పటికే 10 వేలకుపైగా యూనిట్లు విక్రయించినట్లు మస్క్ చెప్తున్నారు. ఇంతకీ సేల్స్‌మెన్ కథేంటంటే..!
టెస్లా కంపెనీతో పలు కంపెనీలకు ఓనర్ అయిన ఎలాన్ మస్క్.. కొన్ని రోజుల క్రితం బోరింగ్ కంపెనీని కూడా స్థాపించాడు. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో 2016 లో స్థాపించిన ది బోరింగ్ కంపెనీ.. ఇప్పటివరకు టన్నెల్ కన్స్ట్రక్షన్ పనుల్లో బిజీగా ఉన్నది. అయితే, ఇప్పుడు కొత్త ప్రాడక్ట్ వైపు తన మైండ్ మళ్లిందేమో.. పెర్ఫ్యూమ్ తయారీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘బర్న్ట్ హెయిర్’ పేరుతో సువాసనల వ్యాపారంలోకి దిగి ప్రాడక్ట్‌ను లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా ‘నాలాంటి పేరుతో సువాసనల వ్యాపారంలోకి రావడం అనివార్యమైంది. నేను దానితో చాలా కాలం పాటు ఎందుకు పోరాడాల్సి వచ్చిందో..’ అంటూ ఎలాన్ మస్క్ ఇవాళ ట్వీట్ చేశారు. దీనికి మూడు రోజుల ముందు ‘కమింగ్ సూన్ ఫ్రమ్ ది @ బోరింగ్ కంపెనీ’ అంటూ తన పెర్ఫ్యూమ్ బాటిల్ ఫొటో పెట్టారు.
ఇప్పటికే దాదాపు 10 వేలకు పైటా పెర్ఫ్యూమ్ బాటిల్స్ విక్రయించినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. తన ట్విట్టర్ బయోను పెర్ఫ్యూమ్ సేల్స్‌మెన్‌గా మార్చుకున్నారు. ది బోరింగ్ కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ ధర రూ.8,400 (100 అమెరికన్ డాలర్లు) గా ఉండనున్నది.
‘ఈ పెర్ఫ్యూమ్ను క్రొప్టో కరెన్సీ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు. డోగేతో చెల్లింపులు జరిపి ‘బర్న్ట్ హెయిర్’ ను సొంతం చేసుకోవచ్చు’ అని తన చివరి మాటగా ఎలాన్ మస్క్ ట్విట్టర్లో జోడించడం విశేషం.