Elon Musk | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ సీఈఓ ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎనిమిది నెలల్లో తనను హత్య చేసేందుకు రెండుసార్లు ప్రయత్నాలు జరిగాయని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ పెట్టారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ఎలన్ మస్క్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. టెక్సాస్ లోని టెస్లా ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే కొందరు వ్యక్తులు తనను తుపాకులతో బెదిరించారని పేర్కొన్నారు. ట్రంప్ మీద హత్యాయత్నం నేపథ్యంలో ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎలన్ మస్క్ పోస్టుకు ‘ఎక్స్’ యూజర్ రిప్లయ్ ఇస్తూ.. ‘ప్లీజ్.. ప్లీజ్.. మీ భద్రతను మూడు రెట్లు పెంచుకోండి. ట్రంప్ కోసం వచ్చిన వారు మీకోసం కూడా వస్తారు’ అని పేర్కొన్నాడు. దీనిపై ఎలన్ మస్క్ ప్రతి స్పందిస్తూ ‘ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత ఎనిమిది నెలల్లో ఇద్దరు వ్యక్తులు (వేర్వేరు సందర్భాల్లో) తనను చంపేందుకు ప్రయత్నించారు. టెక్సాస్ లోని టెస్లా ప్రధాన కార్యాలయానికి వెళుతున్న నన్ను వారు తుపాకులతో బెదిరించారు. అలా చేసినందుకు వారు అరెస్ట్ అయ్యారు’ అని తెలిపారు.
Xiaomi SU7 EV | త్వరలో భారత్ మార్కెట్లోకి షియోమీ సెడాన్ ఎస్‌యూ7 ఈవీ.. గేమ్ చేంజర్ అవుతుందా..?!
ITR Filing | తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ చేయాలంటే ఈ టిప్స్ అనుసరిస్తే సరి..!
CRISIL- Crude Oil | క్రూడ్ ధరతో ప్రభుత్వ ఖజానాపై ద్రవ్యలోటు భారం తప్పదా.. క్రిసిల్ ఆందోళన