హైదరాబాద్, అక్టోబర్ 25: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లలో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోళ్లపై రూ.15 వేల వరకు తక్షణ డిస్కౌంట్‌ను కస్టమర్లకు అందిస్తున్నది.
వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్లు/మై జియో స్టోర్లలో లభించనున్నది. దీంతోపాటు సామ్సంగ్ నియోక్యూ ఎల్ఈడీ టీవీని కొనుగోలు చేసిన వారికి రూ. 41,990 విలువైన 43 అంగుళాల స్మార్ట్ టీవీని ఉచితంగా అం దిస్తున్నది. దీంతోపాటు రూ.46,900 విలువైన యాపి ల్ వాచ్ సిరీస్ 10 ధరను రూ. 44,900కే విక్రయిస్తున్నది. తక్షణ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్‌తో రూ.45,900కే ఐఫోన్ 14కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే గృహోపకరణాలపై 15 శాతం వరకు తగ్గింపు ధరకే విక్రయిస్తున్నది.