హైదరాబాద్, నవంబర్ 4: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.18.58 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం లాభంతో పోలిస్తే 150 శాతం అధికం.
ఆదాయం ఏడాది ప్రాతిపదికన 73 శాతం అధికమై రూ.307.16 కోట్లు ఆర్జించింది. గత త్రైమాసికంలో సంస్థ 154 ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేసింది. గడిచిన ఆరు నెలల్లో రూ.523. 18 కోట్ల ఆదాయంపై రూ.86.57 కోట్ల ఆదాయాన్ని గడించింది.