Reliance | గతవారం దేశీయ స్టాక్మార్కెట్ల ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,34,161.58 కోట్లు పెరిగింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ భారీగా లబ్ధి పొందాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ గతవారం 2.47 శాతం లేదా 1,478.38 పాయింట్లు లాభ పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 69,503.71 కోట్లు పెరిగి రూ.17,17,265.94 కోట్లకు చేరుకున్నది. ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ ఎం-క్యాప్ రూ.48,385.63 కోట్లతో రూ.8,10,927.25 కోట్లకు పెరిగింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,317.15 కోట్లు పెరిగి రూ.14,68,245.97 కోట్లకు చేరింది. ఇక హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,125.41 కోట్లు పెరిగి రూ. 4,91,426.13 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.18,650.77 కోట్లు లబ్ధి పొందడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,69,511.37 కోట్లకు పెరిగింది.
ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.15,127.22 కోట్లు పెరిగి రూ.4,53,593.38 కోట్లకు ఎగిసింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,291.28 కోట్లు పెరిగి రూ.4,72,686.80 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.8,760.41 కోట్లతో రూ.3,95,810.41 కోట్లకు పెరిగింది.
దీనికి భిన్నంగా హిందూస్థాన్ యూనీ లివర్స్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,217.88 కోట్లు పతనమై రూ.5,55,560.85 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 2,854.33 కోట్లు నష్టపోయి రూ.8,56,439.28 కోట్లకు పడిపోయింది. టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సారధ్యం వహిస్తుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్ నిలిచాయి.