న్యూఢిల్లీ, ఆగస్టు 5: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం సెంట్రల్ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసుతో సంబంధమున్న బ్యాంక్ లోన్ మోసం కేసుల్లో అధికారులు అంబానీని ప్రశ్నించారు.
కాగా, గ్రూప్ సంస్థలు బ్యాంకుల నుంచి మోసపూరితంగా రూ.17 వేల కోట్లకుపైగా రుణాలను తీసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 24న ముంబైలో రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన 50 సంస్థల కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉద్యోగులుసహా 25 మంది ఇండ్లలోనూ సెర్చ్ చేసిన సంగతి విదితమే.