గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 31, 2021 , 20:15:03

ప‌ల్లెపల్లెటూరి పిల్ల‌ల్లో పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వాడ‌కం!

ప‌ల్లెపల్లెటూరి పిల్ల‌ల్లో పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వాడ‌కం!

న్యూఢిల్లీ: ప‌ల్లెటూళ్ల‌లో గ‌త రెండేండ్ల‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గ‌ణ‌నీయ స్థాయిలో దాదాపు రెట్టింపైంది. ప్ర‌త్యేకించి బ‌డికి, కాలేజీకి వెళ్లే విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్లు గ‌ల వారి సంఖ్య 36 నుంచి 61 శాతానికి పెరిగింది. దేశంలో విద్యారంగంలో నెల‌కొన్న అస‌మాన‌త‌ల‌ను డిజిట‌ల్ టెక్నాల‌జీ త‌గ్గించివేసింద‌ని ఎక‌న‌మిక్స్ స‌ర్వే-2020 వెల్ల‌డించింది. అయితే, 2020లో క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించ‌డానికి కేంద్రం.. రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డంతో దాదాపు ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రం అంతా ఆన్‌లైన్‌లోనే క్లాస్‌లు జ‌రిగాయి.

ఫ‌లితంగా పెద్ద‌పెద్ద ప‌ట్నాల నుంచి మారుమూల ప‌ల్లెటూళ్ల వ‌ర‌కు విద్యార్థులు కంప్యూట‌ర్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్ల‌లోనే ఆన్‌లైన్ క్లాస్‌ల‌కు హాజ‌ర‌య్యారు. గ్రామీణ ప్రాంతంలో ప్రైవేట్‌, ప్ర‌భుత్వ స్కూళ్ల విద్యార్థులను క‌లుపుకుంటే 2018లో స్మార్ట్‌ఫోన్లు క‌లిగి ఉన్న విద్యార్థులు 36.5 శాత‌మైతే.. 2020 నాటికి 61.8 శాతానికి చేరుకుంది.

ప్రాథ‌మిక పాఠ‌శాల స్థాయిలో 96 శాతం అక్ష‌రాస్య‌త సాధిస్తే, మ‌హిళా అక్ష‌రాస్య‌త ఇప్ప‌టికీ జాతీయ స‌గ‌టుకంటే త‌క్కువ‌గా ఉంద‌ని వెల్ల‌డించింది. జాతీయ శాంపిల్ స‌ర్వే (ఎన్ఎస్ఎస్‌) ప్ర‌కారం ప్రాథ‌మిక స్థాయి 96 శాతం అక్ష‌రాస్య‌త సాధించారు. కానీ ఇప్ప‌టికీ వంద‌శాతం అక్ష‌రాస్య‌త సాధించ‌డంలో వెనుక‌బ‌డ్డామ‌ని ఎక‌న‌మిక్ స‌ర్వే వ్యాఖ్యానించింది. ఏడేండ్ల‌లోపు వారిలో అక్ష‌రాస్య‌‌త 77.7 శాతంగా ఉంద‌ని తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo