చెన్నై, ఏప్రిల్ 25: హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈ-ట్రియో..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. తమిళనాడులోని తన తొలి అవుట్‌లెట్‌ను మంగళవారం కొయంత్తూరులో ప్రారంభించింది. ప్రస్తుతం 10 నగరాల్లో అవుట్లెట్లను ఏర్పాటు చేసిన సంస్థ..
త్వరలో చెన్నై, తిరుచిరాపల్లి, మధురై, సేలంతోపాటు మరో 10 నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ ఎండీ కల్యాణ్ సీ తెలిపారు. ఇప్పటి వరకు 700 వాహనాలను ఉత్పత్తి చేసినట్లు, మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంటే కెపాసిటీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.