Smuggled Gold | హైదరాబాద్ నగరానికి సమీపంలో చౌటుప్పల్ – పతంజలి టోల్ ప్లాజా వద్ద విదేశీయుల వద్ద నుంచి రూ.2.51 కోట్ల విలువైన స్మగుల్డ్ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు జప్తు చేశారు. చెన్నై నుంచి కారులో వస్తున్న ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని బీదర్ వెళుతున్న సమాచారం అందడంతో నిఘా పెట్టినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.
బుధవారం పతంజలి టోల్ ప్లాజా వద్ద కారును తనిఖీ చేయడంతో స్మగుల్డ్ బంగారం బయట పడింది. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించారు. హ్యాండ్ బ్రేక్ దిగువన సీక్రెట్ కావిటీ, క్లచ్ పక్కన లాచ్ లో గోధుమ రంగు కవర్లలో చుట్టిన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం 3577 గ్రాములు ఉంటుందని, దీని విలువ రూ.2,51,46,310 ఉంటుందని డీఆర్ఐ అధికారులు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ పై తరలించారు. బంగారంతోపాటు కారును జప్తు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
Nothing Phone 2a Plus | నథింగ్ మిడ్ రేంజ్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Gold Rates | బంగారం ధర మళ్లీ పైపైకి.. అందరి కళ్లూ అటువైపే..!
Realme | రియల్మీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు రియల్మీ 13 ప్రో.. రియల్మీ 13 ప్రో+ ఆవిష్కరణ
JioBharat J1 4G | మార్కెట్లోకి జియో మరో బడ్జెట్ ఫీచర్ ఫోన్ జియోభారత్ జే1 4జీ.. రూ.1,799లకే లభ్యం..!