సూచీల ర్యాలీకి బ్రేక్.. సెన్సెక్స్ 931, నిఫ్టీ 222 పాయింట్ల పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా ప్రకటించిన సీజ్ ఫైర్‌పై అనిశ్చితి నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా కోల్పోయాయి.
ముంబై, ఏప్రిల్ 9 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా ప్రకటించిన సీజ్ ఫైర్‌పై అనిశ్చితి నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా కోల్పోయాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మధ్యాహ్నం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలను మరింత పెంచాయి.
చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 931.25 పాయింట్లు లేదా 1.20 శాతం పతనం చెంది 76,631.65 వద్దకు జారుకున్నది. ఇంట్రాడేలో 1,215 పాయింట్లు నష్టపోయింది. మరో సూచీ ఎస్ఎన్ఈ నిఫ్టీ 222.25 పాయింట్లు కోల్పోయి 23,775.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా-ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంపై సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్..లెబనాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుస లాభాలకు బ్రేక్పడినట్టు అయింది.
- ఇండిగో షేరు 3.64 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది.
- అలాగే ఎల్అండ్టీ, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ షేర్లు రెండు శాతానికి పైగా కోల్పోయాయి.
- వీటితోపాటు ఎస్బీఐ, ట్రెంట్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్, మారుతి షేర్లు కూడా పతనం చెందాయి.
- బీఈఎల్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- రంగాలవారీగా బ్యాంకింగ్ సూచీ 3 శాతం కోల్పోగా..ఆర్థిక సేవలు 1.41 శాతం, సర్వీసెస్ 1.04 శాతం పతనం చెందాయి.
- కానీ, క్యాపిటల్ గూడ్స్ సూచీ 1.64 శాతం బలపడగా, మెటల్ 1.30 శాతం, పవర్ 1.27 శాతం, హాస్పిటాల్టీ, హెల్త్‌కేర్, యుటిలిటీస్, టెలికాం రంగ సూచీలు కదం తొక్కాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

