ముంబై, అక్టోబర్ 15 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో జోష్ పెంచింది. ఒక దశలో 700 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 575 పాయింట్లు అందుకొని 82,605.43 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ 178.05 పాయింట్లు ఎగబాకి 25,323.55 వద్ద స్థిరపడింది. మార్కెట్లోలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. వీటితోపాటు ఏషియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టుబ్రో, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.