ముంబై, మే 23: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో జోష్ పెంచింది.
సెన్సెక్స్ 769.09 పాయింట్లు ఎగబాకి 81,721.08 పాయింట్లకు చేరుకున్నది. నిఫ్టీ 243.45 పాయింట్లు అందుకొని 24,85 3.15 వద్ద స్థిరపడింది. ఈ వారంలో సెన్సెక్స్ 609.51, నిఫ్టీ 166.65 పాయింట్లు తగ్గాయి.