ముంబై, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను వెనక్కితీసుకోవడంతోపాటు ఐటీ, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి.
ఇంట్రాడేలో 364 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. చివరకు 313.70 పాయింట్లు కోల్పో యి 84,587.01 వద్ద ముగిసింది. నిఫ్టీ 74.70 పాయింట్లు కోల్పోయి 25,884.80 వద్దకు జారుకున్నది.