ముంబై, సెప్టెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశా యి. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకుమించి రా ణించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. విదేశీ సంస్థాగత పెట్టు బడిదారులు ఈక్విటీ మార్కెట్లోకి భారీగా నిధు లను కుమ్మరించడం, ఐటీ, కమోడిటీ సూచీ లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో లాభాల్లో కొనసాగాయి. ఇంట్రాడేలో 300 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 240.98 పాయింట్లు ఎగబాకి 65,628 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 93.50 పాయింట్లు ఎగబాకి 19,528.80 వద్ద స్థిరపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను దేశ వృద్ధిరేటు భారీగా పెరగడం మార్కెట్లకు ఊతమిచ్చినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.