ముంబై, నవంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. మెటల్, బ్యాంకింగ్ షేర్లకు లభించిన మద్దతుతోపాటు ఫెడ్ వడ్డీరేట్ల పెంచే అవకాశాలు లేకపోవడం మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది. అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఉద్యోగ కల్పన ఊపందుకోవడంతో వచ్చే సమీక్షలో వడ్డీరేట్లు పెంచే అవకాశాలు లేవని సంకేతాలు మార్కెట్లకు ఊపునిచ్చాయి.
ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా పెరిగి 66 వేల స్థాయిని అధిగమించిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 275.62 పాయింట్లు ఎగబాకి 65,930.77 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 89.40 పాయింట్లు అందుకొని 19,783.40 వద్ద స్థిరపడింది. మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, తాజాగా ఫెడ్ మినిట్స్ విడుదలకానుండటంతో మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపిందని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.