Stock Markets | మార్కెట్ల రికార్డుల హోరు.. గరిష్ఠ స్థాయికి సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలకు ఎనర్జీ బ్యాంకింగ్ షేర్ల మద్దతుతోపాటు ఈ ఏడాదికిగాను భారత్ అంచనాలకుమించి రాణించనున్నట్లు మూడీస్ వెల్లడించడంతో మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
Stock Markets | ముంబై, మార్చి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలకు ఎనర్జీ బ్యాంకింగ్ షేర్ల మద్దతుతోపాటు ఈ ఏడాదికిగాను భారత్ అంచనాలకుమించి రాణించనున్నట్లు మూడీస్ వెల్లడించడంతో మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఇరు సూచీలు ఆకాశమే చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో భారత్ 8.4 శాతం వృద్ధిని సాధించిన విషయం తెలిసిందే. దీంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 66.14 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 73,872.29 పాయింట్లకు చేరుకున్నది. ఇంట్రాడేలో సూచీ 183.98 పాయింట్లు ఎగబాకి 74 వేల పాయింట్ల దిశలో పయనించింది. మరో సూచీ నిఫ్టీ 27.20 పాయింట్లు అందుకొని ఆల్‌టైం హైకి 22,405.60 పాయింట్లకు చేరుకున్నది. ఇంట్రాడేలోనూ 22,440.90 పాయింట్లు అందుకున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, వాహన రంగ షేర్లను విక్రయించిన మదుపరులు..ఇదే సమయంలో బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా రంగ షేర్లను ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి దోహదపడ్డాయి.
- గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,567 పాయింట్లు(2.15 శాతం), నిఫ్టీ 454 పాయింట్లు(2 శాతం) ఎగబాకింది.
- ఎన్టీపీసీ 3.50 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. పవర్ గ్రిడ్, రిలయన్స్‌లు ఒక్క శాతానికి పైగా బలపడ్డాయి.
- యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, మారుతి , బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.
- కానీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, టైటాన్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, నెస్లె, ఎల్అండ్టీ, ఎస్బీఐ, టాటా మోటర్స్ షేర్లు నష్టపోయాయి.
- బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
- రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, పవర్, యుటిలిటీ, టెలి కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ రంగ సూచీలు లాభాల్లో ముగియగా..కమోడిటీస్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, టెక్నాలజీ షేర్లు నష్టపోయాయి.
- బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.3.93 లక్షల కోట్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

