న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. గత నెల 2.6 శాతం తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్లో 34.47 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దిగుమతులూ 15 శాతం తగ్గి 53.84 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 19.37 బిలియన్ డాలర్లుగా నమోదైంది.