న్యూఢిల్లీ, నవంబర్ 16 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ దూసుకుపోతున్నది. గత నెలలో దేశీయంగా అమ్ముడైన టాప్-10 వాహనాల్లో ఆరు బ్రాండ్లు మారుతికి చెందినవే కావడం విశేషం. గత కొన్ని నెలలుగా అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ సంస్థలకు గత పండుగ సీజన్ కిక్కునిచ్చింది. నిర్వహణ ఖర్చులు పెరిగినాయంటూ ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచుతుండటంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ గత నెలలో అమ్ముడైన మొత్తం వాహనాల్లో మారుతికి చెందిన వాహనాలకు పెద్దపీట వేశారు. అలాగే హ్యుందాయ్, మహీంద్రా, టాటాలకు చెందిన బ్రాండ్లకు కూడా మద్దతు లభించింది.