Civil Aviation | దేశీయ విమాన ప్రయాణికులు 13 శాతం పెరిగారు.. తగ్గనున్న నష్టాలు..!
Civil Aviation | 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన యానం చేసిన ప్రయాణికులు 13 శాతం పెరిగిందని తేలింది.
Civil Aviation | విదేశాలకు వెళ్లే వారితోపాటు దేశీయంగా వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో విమాన యానం చేసిన ప్రయాణికులు 13 శాతం పెరిగిందని తేలింది. 2023-24లో విమాన ప్రయాణం చేసిన వారి సంఖ్య 15.4 కోట్ల మందికి చేరిందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది.
కరోనాకు ముందు విమాన ప్రయాణికుల కంటే ఇప్పుడు విమానయానం చేసే వారు పెరిగారు. 2019-20లో 14.2 కోట్ల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణం చేస్తే, గత నెలలోనే 1.35 కోట్ల మంది ప్రయాణించారు. ఇది 2022-23తో పోలిస్తే రెండు శాతం ఎక్కువ. ఫిబ్రవరిలో 1.26 కోట్ల మంది ప్రయాణించారని తేలింది.
ఇక 2023 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ విదేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 2.7 కోట్ల మంది. 2022-23తో పోలిస్తే 25 శాతం అధికంగా గతేడాది విదేశాలకు విమాన ప్రయాణం చేశారు. విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల విమానయాన రంగానికి వచ్చే నష్టం రూ.3,000 కోట్ల నుంచి రూ.4000 కోట్లకు పరిమితం అవుతుందని ఇక్రా అంచనా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

