Diwali Car Offers | భారతీయులు పండుగల సీజన్లోనే తమకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఇప్పడు ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా పలు కార్ల తయారీ సంస్థలు తమ ‘హ్యాచ్ బ్యాక్’ మోడల్ కార్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, బెనిఫిట్లు అందిస్తున్నాయి. ఆయా కార్లు అందిస్తున్న బెనిఫిట్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు, స్పెషల్ ఫెస్టివ్ ఆఫర్లు ఉన్నాయి. అవేమిటో ఓ లుక్కేద్దామా..!
టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ఆల్ట్రోజ్ మీద రూ.30 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. ఇది సీఎన్జీ వేరియంట్‌కూ వర్తిస్తుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న డీజిల్ మోడల్ కారు టాటా ఆల్ట్రోజ్ ఒక్కటే కావడం గమనార్హం.
టాటా మోటార్స్ మరో హ్యాచ్ బ్యాక్ మోడల్ టియాగో మీద గరిష్టంగా రూ.40వేల డిస్కౌంట్ అందించారు. అయితే ఈ డిస్కౌంట్ సీఎన్జీ వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది.
ఒకప్పుడు పాపులర్ మోడల్ కారు ‘క్విడ్’పై రెనాల్ట్ రూ.50 వేల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నది. 1.0 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ తో వస్తున్నది. రెనాల్ట్ క్విడ్ కారుకు మారుతి సుజుకి ఆల్టో కే10 గట్టి పోటీ ఇస్తుంది.
హ్యుండాయ్ మోటార్స్ తన ప్రీ ఫేస్ లిఫ్ట్ ‘హ్యుండాయ్ ఐ20 ఎన్ లైన్’ కారుపై ఆకర్షణీయ డిస్కౌంట్లు అందిస్తుంది. సుమారు రూ.55 వేల వరకూ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ మోడల్స్‌లో అత్యధిక సేల్స్ నమోదవుతున్న మోడల్ మారుతి బాలెనో. హ్యుండాయ్ ఐ20 నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. దీనిపై రూ.55 వేల వరకూ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఫైన్ క్వాలిటీ రైడ్, ఎఫిషియెంట్ పెట్రోల్ ఇంజిన్, కంఫర్టబుల్‌గా ఉంటుందీ కారు.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మోడల్ కార్లపై రూ.58 వేల వరకూ రాయితీ అందిస్తున్నది. 1.0 లీటర్, 1.2 లీటర్ల వ్యాగన్ఆర్ వేరియంట్లకూ ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
మారుతి సుజుకి ఇగ్నిస్ అంత పాపులర్ కాకపోయినా.. ఎంట్రీ లెవల్ కార్ల కొనుగోలుదారుల ద్రుష్టిని ఆకర్షిస్తుంది. స్పేసియస్గానూ ఉంటుంది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. పండుగ సీజన్ నేపథ్యంలో రూ.65 వేల వరకూ డిస్కౌంట్లు అందిస్తున్నది.
తొలిసారి కారు కొనుగోలు చేసే వారికి సరైన ఆప్షన్ మారుతి ఆల్టో కే10. 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్న ఈ బుల్లి కారుతో స్ట్రెస్ లేకుండా హాయిగా ప్రయాణం చేయొచ్చు. దీనిపై రూ.70 వేల వరకూ రాయితీలు అందుబాటులో ఉన్నాయి.
మారుతి సుజుకి సెలేరియో మోడల్ కారుపై గరిష్టంగా రూ.73 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లకు ధర తగ్గింపు వర్తిస్తుంది. మోస్ట్ ఫ్యుయల్ ఎఫిషియెంట్ కార్లలో ఇదొకటి.
సిట్రోన్ ఆవిష్కరించిన ‘సీ3’ మోడల్ హ్యాచ్ బ్యాక్ కారుపై రూ.లక్ష వరకూ రాయితీ అందుబాటులో ఉంది. డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్‌లో మోస్ట్ అప్పీలింగ్‌గా ఉంటుంది. స్పేసియస్‌గా ఉండే ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారులో కొన్ని కీలక ఫీచర్లు మిస్ అయ్యాయి.