హైదరాబాద్, నవంబర్ 7 : రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కంపెనీ రూ.689 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.510 కోట్ల లాభంతో పోలిస్తే 35 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో ఆదాయం రూ.2,338 కోట్ల నుంచి రూ.2,715 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. నిజానికి నిర్వహణ ఖర్చులు రూ.1,722 కోట్ల నుంచి రూ.1,948 కోట్లకు పెరిగినా భారీ లాభాలే వచ్చాయి.