న్యూఢిల్లీ, ఆగస్టు 20: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జూ ఏర్పాటుచేసేందుకు అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిలయన్స్ ప్రతిపాదించిన గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ, రిహబిలిటేషన్ సెంటర్‌కు సెంట్రల్ జూ అథారిటీ జూ గుర్తింపును మంజూరు చేయడంలో చట్ట విరుద్ధమైదేదీ లేదని న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది.