హైదరాబాద్, జూలై 6: సౌదీ అరేబియాకు చెందిన చౌక విమానయాన సంస్థ ఫ్లైదిల్..దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది. తన తొలి సర్వీసును రియాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును హైదరాబాద్‌కు ప్రారంభించింది. తన తొలి విమాన సర్వీసు జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం దిగింది. రియాద్‌లో రాత్రి 11.20 గంటలకు బయలుదేరనున్న విమాన సర్వీసు ఆ మరుసటి రోజు హైదరాబాద్‌కు ఉదయం 6.50 గంటలకు చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో ఉదయం 7.55 గంటలకు బయలుదేరి 11.05 గంటలకు రియాద్ చేరుకోనున్నది.