Nirmala Sitaraman | ప్రజలకు డిజిటల్ పేమెంట్స్ బాగున్నాయని, ఆ సేవలు వారికి ఉచితంగా అందించాల్సిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సర్వీస్ ప్రొవైడర్లు తమ ఖర్చులను ఇతర మార్గాల్లో భర్తీ చేసుకోవాలని అన్నారు. డిజిటల్ చెల్లింపులపై ఎటువంటి చార్జీలు విధించబోమని మరోసారి నొక్కి చెప్పారు. 2020 జనవరి ఒకటో తేదీ నుంచి యూపీఐ జీరో చార్జీ ఫ్రేమ్ వర్క్ విధానం అమల్లోకి వచ్చింది.
శనివారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలకు డిజిటల్ పేమెంట్స్ బాగున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ ప్రజలకు ఆకర్షణీయంగా ఉందని తెలిపారు. డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకత ఉన్నతస్థళాయికి చేరుకోవాల్సి ఉందని చెప్పారు. కనుక యూపీఐ సేవలపై చార్జీలు విధించడానికి సమయం రాలేదని స్పష్టం చేశారు.
యూపీఐ లావాదేవీలు, ఇతర చెల్లింపు విధానాలు, డెబిట్-క్రెడిట్ కార్డులపై ఇంటర్చేంజ్ ఫీజు వసూళ్లపై అభిప్రాయాలు తెలపాలని ఆర్బీఐ కోరింది. డిజిటల్ ఎకానమీ మరింత బలోపేతం చేయడానికి డిజిటల్ ఎకోసిస్టమ్‌కు ఈ ఏడాది కూడా మద్దతు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.