న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: పైలెట్లకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ శిక్షణ కేంద్రం హైదరాబాద్‌లో ఎయిర్ ఇండియా ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకోసం విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
హైదరాబాద్‌తోపాటు ముంబైల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ శిక్షణ కేంద్రానికి సంబంధించి కొన్ని లోపాలు సరిదిద్దడంతో తిరిగి అనుమతి మంజూరు చేసినట్లు డీజీసీఏ వర్గాలు వెల్లడించాయి. కొన్ని లోపాలు గుర్తించడంతో ఈ రెండు సిమ్యులేటర్ శిక్షణ కేంద్రాలను రద్దు చేసిన డీజీసీఏ..మళ్లీ షరతులతో అనుమతించింది.