Deutsche Bank Research : జనరేటివ్ ఏఐ అన్ని రంగాల్లో పెను మార్పులకు శ్రీకారం చుడుతుండగా నూతన టెక్నాలజీపై డచ్ బ్యాంక్ రీసెర్చ్ రిపోర్ట్ ఆసక్తికర వివరాలు వెల్లడించింది. జనరేటివ్ ఏఐ టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కించే సత్తా కలిగిఉన్నా నిర్ధిష్ట టాస్క్‌ల విషయంలో ముఖ్యంగా గణితంలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. అనువాదం, సమ్మరైజింగ్, డ్రాఫ్టింగ్, క్రియేటివ్ కంటెంట్ వంటి పలు అంశాల్లో జనరేటివ్ ఏఐ ఉపయోగకరమని వెల్లడైనా తార్కికం, ప్రపంచంపై అవగాహన పెంపొందించడంలో దాని పరిమితులు ముఖ్యమైన అడ్డంకులుగా మిగిలిపోయాయని పేర్కొంది.
కొన్ని కార్యకలాపాల్లో జనరేటివ్ ఏఐ అద్భుతంగా పనిచేస్తున్నా గణాంక టాస్క్‌ల వంటి నిర్ధిష్ట అంశాల్లో ఇది ఏమాత్రం మెరుగ్గా లేదని నివేదిక తేల్చిచెప్పింది. విశ్వసనీయ డేటాను వాడినప్పటికీ అసమగ్ర సమాచారాన్ని జనరేటివ్ ఏఐ వ్యవస్ధలు ఉత్పత్తి చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత సొల్యూషన్స్ ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించలేకపోతున్నాయని పేర్కొంది. ఏఐ మోడల్స్ విస్తృతంగా మెరుగవుతున్నా ఈ సవాళ్లు అలాగే ఉన్నాయని స్పష్టం చేసింది.
ప్రతి సెట్టింగ్‌లో నూతన టెక్నాలజీ సమర్ధవంతంగా లేదని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ వెల్లడిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఇక అధిక నియంత్రణతో కూడిన ఆర్ధిక సేవలు, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో ఏఐ వినియోగం మందకొడిగా ఉందని నివేదిక గుర్తించింది. ఈ రంగాల్లో చిన్నపాటి తప్పులు తీవ్ర పరిణామాలకు దారితీసే ముప్పు ఉండటం ఈ రంగాల్లో ఏఐ వాడకాన్ని నియంత్రిస్తున్నాయని పేర్కొంది.
Read More :
Hema Drugs Case | పరువు కోసం చచ్చిపోతా.. డ్రగ్స్ కేసులో మీడియాపై మండిపడిన హేమ