న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశవ్యాప్తంగా చమురుకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 233.276 మిలియన్ టన్నుల డిమాండ్ నెలకొన్నది. అంతక్రితం ఏడాది 223.021 మిలియన్ టన్నుల కంటే ఇది 5 శాతం వరకు అధికం.
కానీ, గతేడాది చివరి నెల మార్చిలో మాత్రం డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 0.6 శాతం తగ్గి 21.09 మిలియన్ టన్నులకు పడిపోయింది. వాహన అమ్మకాలు భారీగా పెరగడం ఇందుకు కారణమని పీపీఏసీ వెల్లడించింది.