150 మందికి ఉద్యోగాలివ్వనున్న బ్రిటన్ సంస్థ
విదేశాల్లో సంస్థకిదే అతిపెద్ద టెక్నాలజీ హబ్
హైదరాబాద్, మార్చి 9: బ్రిటన్ ప్రధాన కేంద్రంగా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న ‘డెలివరూ’…హైదరాబాద్లో ఇంజినీరింగ్ సెంటర్ను ఆరంభించింది. బ్రిటన్ అవతల ఏర్పాటు చేసిన అతిపెద్ద టెక్నాలజీ హబ్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ యూనిట్ కోసం ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రస్తుతేడాది ముగిసేనాటికి ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, అనలటిక్స్ వంటి విభాగాల్లో 150 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. కంపెనీకి ఇప్పటికే ఉన్న సెంట్రల్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ అనుసంధానంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ సెంటర్ పనిచేయనున్నది. డెలివరీ సేవలను మరింత ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ సీఈవో, ఫౌండర్ విల్ షూ తెలిపారు. ప్రస్తుతం సంస్థ యూరప్, మధ్య ఆసియా, ఆస్ట్రేలియా దేశాల్లో సేవలు అందిస్తున్నది.