SpiceJet | స్పైస్జెట్కేమైంది.. 17 రోజుల్లో ఆరు సార్లు ఇలా.. ఎందుకని?!
SpiceJet | స్పైస్‌జెట్ విమానంలో మంగళవారం సాంకేతిక లోపంతో కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
SpiceJet | దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం ఒకటి అత్యవసర పరిస్థితుల్లో మంగళవారం కరాచీ విమానాశ్రయంలో ల్యాండయింది. ఢిల్లీ నుంచి దుబాయికి బయలుదేరిన విమానంలో ఫ్యూయల్ ఇండికేటర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా కరాచీ విమానాశ్రయంలో ల్యాండయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. గత 17 రోజుల్లో స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడం ఇది ఆరోసారి. గత ఐదు ఘటనలతో కలిపి మొత్తం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.
ఢిల్లీ- నుంచి దుబాయి బయలుదేరిన స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ట్యాంకులో ఫ్యూయల్ పరిమాణం తగ్గినట్లు సంఏకతాలు వచ్చాయి. దీంతో కరాచీకి దారి మళ్లించారని డీజీసీఏ అధికారులు తెలిపారు. కరాచీ విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీలో ఆయిల్ ట్యాంక్ లీక్ అయినట్లు కనిపించలేదని పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (పీసీఏఏ) ధృవీకరించింది. స్పైస్‌జెట్ విమాన పైలట్ తమ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరారని పీసీఏఏ అధికారి చెప్పారు. మానవత్వ కోణంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించామన్నారు. ఆ సమయంలో విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు.
గత నెల 19 నుంచి స్పైస్‌జెట్ విమానాల్లో ఆరు దఫాలు సాంకేతిక లోపాలు తలెత్తాయి. జూన్ 19న పాట్నా నుంచి 185 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని నిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. పక్షి ఢీ కొట్టడంతో ఇంజిన్ దెబ్బతిన్నది. అదే రోజు జబల్పూర్-ఢిల్లీ విమానంలో మరో సమస్య తలెత్తింది.
గత నెల 24,25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్‌లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తింది. దీంతో ఆ రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల రెండో తేదీన జబల్పూర్-ఢిల్లీ విమానం క్యాబిన్లో పొగలు వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

