హైదరాబాద్, మే 16: ప్రీమియం రబ్బరు ఉత్పత్తుల తయారీ సంస్థ దీసావాలా.. హైదరాబాద్‌లో నాలుగో యూనిట్‌ను తెరిచింది. ఇప్పటికే బాల్నగర్లో మూడు ప్లాంట్లు ఉండగా, తాజాగా మేడ్చల్‌కు సమీపంలోని కాళ్లకల్ వద్ద 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు ప్లాంట్‌ను ఆరంభించింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ఈ నాలుగో ప్లాంట్‌ను రూ.40 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసినట్లు, తద్వారా 200 నుంచి 300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని దీసావాలా రబ్బర్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముర్తాజ దీసావాలా తెలిపారు. దీంతో ప్రస్తుతం రోజుకు 7-8 టన్నుల రబ్బర్ ఉత్పత్తి అవుతుండగా, ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో కెపాసిటీ మూడింతలు పెరిగి 25 టన్నులకు చేరుకున్నదని చెప్పారు. నాణ్యమైన రబ్బర్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ యూనిట్ పక్కనే మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..2025-26 నాటికి రూ.300 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.