న్యూఢిల్లీ, ఆగస్టు 21: స్పోర్ట్స్ పరికరాల సంస్థ డెకథ్లాన్..భారత్లో తన వ్యాపారాన్ని విస్తరించడానికి వచ్చే ఐదేండ్లలో 100 మిలియన్ల యూరోలు(రూ.933 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను పెంచుకోవడంతోపాటు ప్లాంట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు డెకథ్లాన్ ఇండియా సీఈవో శంకర్ ఛటర్జీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 స్టోర్లు ఉండగా, వచ్చే ఐదేండ్లలో వీటిని 190కి పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఇక నుంచి ప్రతియేటా 10-15 కొత్త స్టోర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.