Retail Inflation | ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి దిగి వచ్చింది. నవంబర్లో 5.48 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం.. డిసెంబర్ నెలలో 5.22 శాతానికి దిగి వచ్చింది. అక్టోబర్లో 6.21 శాతంతో 14-నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. నవంబర్లో పతనమైంది. డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా 2-6 శాతం మధ్యకు దిగి వచ్చింది.
కూరగాయలు, పప్పు ధాన్యాలు, చెక్కెర, తృణ ధాన్యాల ధరలు తగ్గడం వల్లే డిసెంబర్ ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా దిగి వచ్చింది. కన్ఫెక్షనరీ, పర్సనల్ కేర్ ధరలు దిగి వచ్చాయి. గ్రామీణ ద్రవోల్బనం 5.76 శాతంగా ఉంటే, పట్టణ ద్రవ్యోల్బణం 4.58 శాతంగా రికార్డైంది.