Investors Wealth | దేశీయ స్టాక్ మార్కెట్ల ఇండెక్సులు వరుసగా మూడు సెషన్లలో నష్టాలతో ముగుస్తున్నాయి. బీఎస్ఈ-30 ఇండెక్సులోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు రోజుల్లో భారీగా కోల్పోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపద రూ.22 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ మూడు సెషన్లలో దాదాపు నాలుగు శాతం (3.99 శాతం) అంటే 3,274.48 పాయింట్ల పతనంతో ముగిసింది. ఆగస్టు ఒకటో తేదీన బీఎస్ఈ ఇండెక్సు సెన్సెక్స్ 82,129.49 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. నాటి నుంచి స్టాక్ మార్కెట్లలో కరెక్షన్లు చోటు చేసుకుంటున్నాయి.
దీంతో గత మూడు సెషన్లలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,02,996.27 కోట్ల నష్టంతో రూ.4,39,59,953.56 (5.24 లక్షల అమెరికా డాలర్లు) కోట్లకు పడిపోయింది. ఇన్వెస్టర్లు బలం పుంజుకుంటున్న జపాన్ కరెన్సీ యెన్, బలహీనంగా ఉన్న యూఎస్ ఆర్థిక గణాంకాలు, రోజురోజుకు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఇన్వెస్టర్లు సునిశితంగా పరిశీలిస్తున్నారు.
సోమవారం జపాన్, ఇతర గ్లోబల్ మార్కెట్లలో నష్టాల ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. భారీగా ఇండెక్సులు నష్టపోవడంతో సోమవారం ఒక్కరోజే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,32,796.1 కోట్లు (5.27 లక్షల అమెరికా డాలర్లు) నష్టపోయాయి.
మంగళవారం అంతర్గత ట్రేడింగ్లో 1000 పాయింట్లు పుంజుకున్నా బ్యాంకింగ్, టెలికం, ఆటో షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో బీఎస్ఈ సెన్సెక్స్ 166.33 పాయింట్ల నష్టంతో ముగిసింది.
మంగళవారం ఐటీ, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ, సర్వీస్ రంగాల ఇండెక్సులు లాభ పడ్డాయి. మరోవైపు బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.71 శాతం, స్మాల్ క్యాప్ 0.57 శాతం, బీఎస్ఈ టెలికం ఇండెక్స్ 1.15 శాతం, ఫైనాన్సియల్ సర్వీసెస్ 1.03, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.92 శాతం, బ్యాంకెక్స్ 0.76, కన్జూమర్ డిస్క్రిషనరీ 0.48 శాతం నష్టాలతో ముగిశాయి.
iQoo Z9s 5G | బడ్జెట్ ధరకే ఐక్యూ జడ్9ఎస్ సిరీస్ ఫోన్లు.. 21న ఆవిష్కరణ..!
Tata Curvv EV | 7న టాటా కర్వ్.ఈవీతోపాటు చార్జ్ పాయింట్ అగ్రిగేటర్ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!