హైదరాబాద్, ఏప్రిల్ 8 : దేశీయ టెక్నాలజీ సంస్థ సైయెంట్ నూతనంగా సెమికండక్టర్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ వ్యాపారాన్ని నిర్వహించడానికి రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీ కృష్ణ బొడనపు తెలిపారు. ఈ నిధులను ఇతర పెట్టుబడిదారులనుంచి ఈ ఏడాది చివరిలోగా సేకరించనున్నట్టు ప్రకటించిన ఆయన.. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లను నియమించుకోనున్నట్టు చెప్పారు. పలు పరిశ్రమలకు చెందిన కస్టమైజ్డ్ సిలికాన్ చిప్‌లను తయారు చేసి అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నదని, పలువురు టెక్నాలజీ నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించారు.