హైదరాబాద్, ఆగస్టు 5: డాటా సెంటర్ల నిర్వహణ సంస్థ కంట్రోల్ఎస్.. రూ.400 కోట్ల పెట్టుబడితో పాట్నాలో గ్రీన్ఫిల్డ్ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం భూమిని కొనుగోలు చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
వెయ్యి మంది కూర్చోవడానికి వీలుండే ఈ డాటా సెంటర్ వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. ఇప్పటికే సంస్థకు హైదరాబాద్‌తోపాటు ముంబై, నోయిడా, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, పాట్నాల్లో డాటా సెంటర్లు నిర్వహిస్తున్నది.