Crude Oil : ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటనతో ముడి చమురు (Crude Oil) ధరలు అమాంతం పడిపోయాయి. ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని, ఐదు రోజులు ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయబోమని ట్రంప్ చెప్పడమే ఆలస్యం చమురు ధరలు 13 శాతం తగ్గాయి. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు కృషి చేస్తానని అమెరికా అధినేత వెల్లడించడంతో సోమవారం సాయంత్రానికి బ్యారెల్ చమురు ధర 100.34 డాలర్లకు చేరింది.
పశ్చిమాసియా యుద్ధంతో భారీగా పెరిగిన చమురు ధరలు దిగొచ్చాయి. ఇరాన్‌పై యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో రవాణా భయం కారణంగా సోమవారం ఉదయం బ్యారెల్ ధర 113 డాలర్లకు చేరింది.
Oil prices fell by more than 13% after Trump said he would order the military to postpone any strikes against Iranian power plants and energy infrastructure.
🔴 LIVE updates: https://t.co/gZPhHf1ozX pic.twitter.com/dag3sgcE0v
— Al Jazeera English (@AJEnglish) March 23, 2026
వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) ముడి చమురు సైతం పెరిగింది. అయితే.. డెడ్‌లైన్‌కు ముందే యూటర్న్ తీసుకున్న ట్రంప్ ఇరాన్‌పై చర్చలు జరుపుతున్నామని, ఆ దేశ పవర్ ప్లాంట్లపై ఐదు రోజులు దాడులకు పాల్పడబోమని ప్రకటించారు. దాంతో సాయంత్రం 5:30 గంటలకు బ్రెంట్ చమురు ధర బ్యారెల్ 100.34 డాలర్లకు తగ్గింది. యుద్ధం తీవ్రతలోనూ కాస్త ఉపశమనం కలిగిస్తూ 6.2 శాతానికి చమురు ధరలు తగ్గాయి.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపిన ట్రంప్ తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ట్రుత్ సోషల్ పోస్ట్‌లో ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు నిలిపి వేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ట్రంప్ ప్రకటనతో మూడు వారాలకు పైగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడే అవకాశముంది.
Trump announces he ordered to postpone strikes against Iranian energy infrastructure for 5 days pic.twitter.com/ELW18FLsAL
— The Daily News (@DailyNewsJustIn) March 23, 2026
హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు ఇరాన్‌కు 48 గంటల సమయం ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. మూడు వారాకులపైగా ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ట్రంప్.. తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
‘అమెరికా, ఇరాన్ మధ్య గత రెండు రోజులుగా మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాల రక్షణ గురించీ చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం మొత్తం ఇరుదేశాల మధ్య పలు అంశాల మీద లోతైన చర్చలు జరుగనున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగుతున్నందున.. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన వనరులపై ఐదు రోజుల పాటు ఎలాంటి సైనికి దాడులకు పాల్పడవద్దని మా యుద్ధ విభాగానికి ఆదేశాలిచ్చాను. ఈ విషయంపై ఆసక్తి చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని ట్రంప్ పేర్కొన్నారు.