కోవిడ్‌తో సిబ్బంది కొరత.. ఈ-కామర్స్ డెలివరీ స్టాఫ్ శాలరీ రెట్టింపు!!
ఈ-కామర్స్ డెలివరీ స్టాఫ్ శాలరీ రెట్టింపు!!| కరోనా రెండో వేవ్ ప్రభావంతో ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాలు తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నా...

న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ ప్రభావంతో ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాలు తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా డెలివరీ స్టాఫ్, ఇతర ఉద్యోగులకు భారీ ఇంక్రిమెంట్లు, ఇన్సెంటివ్‌లు, ప్రయోజనాలు కల్పించేందుకు కంపెనీలు సిద్ధం అయ్యాయి.
వినియోగదారులకు సరుకులు బట్వాడా చేసే సిబ్బందికి డిమాండ్ పెరిగింది. మరింత మంది ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ-కామర్స్ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి.
డెలివరీ సిబ్బందికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, షాడోఫాక్స్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ తదితర ఈ-కామర్స్ సంస్థలు గత వేతనంతో పోలిస్తే రెట్టింపు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాయి.
కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని సంస్థల్లో డెలివరీ స్టాఫ్ తగ్గిపోయారు. కొంత మంది వైరస్ సోకడంతో కొన్ని వారాల తరబడి విధులకు దూరంగా ఉండాల్సి వస్తున్నది. కొవిడ్-19 భయంతో చాలా మంది తమ ఇండ్లకు వెళ్లిపోవడంతో సిబ్బంది కొరతకు కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గ్రోఫర్స్ తమ డెలివరీ సిబ్బందికి భోజన వసతితోపాటు గత వేతనంతో పోలిస్తే రెట్టింపు చెల్లిస్తామని ప్రకటించింది. రీజియన్ల వారీ పరిస్థితులను బట్టి షాడో ఫాక్స్ 10-15 శాతం వేతనాలు పెంచింది. ఈ సంస్థ ప్రస్తుతం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లరు కూడా సరఫరా చేస్తున్నది. డెలివరీ స్టాఫ్‌కు కొవిడ్ హెల్ప్‌లైన్ అందుబాటులోకి తెచ్చింది.
టాస్క్‌మో సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ జనద్రి మాట్లాడుతూ ఇంతకుముందు తమ డెలివరీ స్టాఫ్ వేతనాలు రూ.700-1000 మధ్య ఉండేదని, ఇప్పుడు రూ.900-1,500 పలుకుతుందన్నారు. అలాగే ఈకామ్ ఎక్స్‌ప్రెస్ తమ డెలివరీ స్టాఫ్‌కు వచ్చే రెండు వారాల్లో వార్షిక ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
కొన్ని సంస్థలు తమ సిబ్బంది పనితీరు, చురుకుదనాన్ని బట్టి అటెండెన్స్ బోనస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పెర్ఫార్మెన్స్ ఆధారిత ఇన్సెంటివ్‌లు, బెటర్ జాయినింగ్ బోనస్ తదితర రూపాల్లో లబ్ధి చేకూరుస్తున్నాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

