LPG cylinder | వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) ఉపశమనం కలిగించాయి.
LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను తగ్గించాయి. 19 కేజీల సిలిండర్పై రూ.14.50 తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అంటే మే 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,747.50కి చేరింది. కోల్కతాలో రూ.1,851.50కి, ముంబైలో రూ. 1,699కి, చెన్నైలో రూ. 1906కి చేరింది. అయితే, ఇంట్లో వినియోగించే సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
మరోవైపు విమాన ఇంధన ధరలనూ చమురు కంపెనీలు తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటరుకు 4.4 శాతం మేర తగ్గించాయి. అంటే రూ.3,954 మేర తగ్గింది. దీంతో కిలోలీటర్ 85,486.80కు దిగొచ్చింది. ఏటీఎఫ్ ధరలు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. ఏప్రిల్ 1న కూడా ఏటీఎఫ్ ధరల్ని 6.15 శాతం (రూ.5,870) మేర చమురు కంపెనీలు తగ్గించిన విషయం తెలిసిందే.
Also Read..
Gold Price | పసిడి కొనేవారికి గుడ్న్యూస్.. ఒక్కరోజే రూ.2వేలు తగ్గిన బంగారం ధర
Bank Holidays | మే నెలలో 13 రోజులు మూత పడనున్న బ్యాంకులు.. పూర్తి వివరాలు ఇవే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

