LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను తగ్గించాయి. 19 కేజీల సిలిండర్‌పై రూ.30.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
చమురు సంస్థల నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,795గా ఉన్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,764.50కి తగ్గింది. అదేవిధంగా ముంబైలో రూ.1,749 నుంచి రూ.1,717.50కి తగ్గింది. చెన్నైలో మాత్రం 19 కేజీల సిలిండర్‌పై రూ.30 తగ్గించారు. దీంతో ప్రస్తుత ధర రూ.1,960.50 నుంచి రూ.1,930కు సిలిండర్ ధర తగ్గింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1,911 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,879కి తగ్గింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గత నెల మహిళా దినోత్సవం సందర్భంగా గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధర రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది.
Also Read..
Boney Kapoor | అతడెప్పుడూ మాజీ కాదు.. జాన్వీకపూర్ బాయ్ ఫ్రెండ్‌పై బోనీకపూర్ కామెంట్స్ వైరల్
Bengal storm | బెంగాల్లో తుపాను బీభత్సం.. ఐదుగురు మృతి, 300 మందికి గాయాలు
Vijay Deverakonda | నేనిప్పుడు కొత్త డైరెక్టర్లతో పనిచేయనంటోన్న విజయ్ దేవరకొండ..!