Boney Kapoor | బాలీవుడ్ (Bollywood) స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కూతురు జాన్వీకపూర్ (Janhvi Kapoor) దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. తారక్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు రాంచరణ్, బుచ్చిబాబుసాన కాంబోలో వస్తున్న ఆర్సీ 16లో కూడా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తన తల్లి శ్రీదేవి రూల్ చేసిన తెలుగు చిత్ర పరిశ్రమలో భాగమవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉంది జాన్వీకపూర్. ఇదిలా ఉంటే ఈ అందాల భామ శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉన్నట్టు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయని తెలిసిందే.
శిఖర్ పహారియా చాలా ఈవెంట్స్‌లో బోనీకపూర్, జాన్వీతో కలిసి కనిపించాడు. అయితే పుకార్లప మాత్రం శిఖర్, జాన్వీ ఇద్దరూ సైలెంట్‌గానే ఉన్నారు. మైదాన్ ప్రమోషన్స్ లో బోనీకపూర్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. శిఖర్ పహారియా గురించి అడుగగా.. అతడంటే ఇష్టం. అంతేకాదు రెండు సంవత్సరాల క్రితం జాన్వీకపూర్ అతన్ని చూడలేదు. కానీ నేను ఇప్పటికీ అతడితో స్నేహంగా ఉంటానన్నాడు.
అంతేకాదు అతడు (శిఖర్ పహారియా) ఎప్పుడూ మాజీ కాదనే నిర్ణయానికి వచ్చేశా. ఓ వ్యక్తి ఏ సందర్భంలోనైనా నా కోసం, జాన్వీకపూర్, అర్జున్ కపూర్ కోసం పక్కనే ఉంటే.. అతడు ప్రతీ ఒక్కరితోనూ స్నేహంగానే ఉంటాడు. మా అలాంటి వ్యక్తి దొరకడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. శిఖర్ పహారియాను ఆకాశానికెత్తేస్తూ బోనీకపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. భవిష్యత్‌లో తన కూతురు జాన్వీకపూర్‌కు సంపూర్ణ భద్రత కల్పించే వ్యక్తి శిఖర్ పహారియా అని గట్టిగా ఫిక్సయినట్టు తాజా కామెంట్స్ తో అర్థమవుతోంది.
Janhvi Kapoor