హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : పర్యావరణహిత, ఉద్ఘార రహిత బొగ్గు, ఇంధనాలపై పరిశోధనలకోసం ఐఐటీ హైదరాబాద్‌తో కోల్ ఇండియా కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ.98 కోట్ల గ్రాంట్‌తో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో(క్లీన్జ్) సంస్థను ఐఐటీహెచ్‌లో నెలకొల్పేందుకు ఇరు సంస్థలు జట్టుకట్టాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి సమక్షంలో కోలిండియా సీఎండీ పీఎం ప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర బీఎస్ మూర్తిలు పరస్పర ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గినప్పుడే సంక్షేమం సాధ్యమని, ఉద్యోగుల పని సంస్కృతి మరింత మెరుగుపడాల్సిన అవసరముందని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు. శుక్రవారం సింగరేణిభవన్‌లో 38వ స్ట్రక్చర్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి బొగ్గు విక్రయ ధరలు కోల్ ఇండియా, విదేశీ బొగ్గు కన్నా అధికంగా ఉన్నాయని, దీంతో ఈ బొగ్గుకు డిమాండ్ క్రమంగా పడిపోతున్నదని, ఇది ఆందోళనకరమన్నారు.