కాగ్నిజెంట్‌లో 50 వేల ఫ్రెషర్లు
అమెరికా కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న కాగ్నిజెంట్..మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను 563 మిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది.
- ఈ ఏడాది నియమించుకోనున్న అమెరికా టెక్నాలజీ సంస్థ
న్యూఢిల్లీ, మే 5: అమెరికా కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న కాగ్నిజెంట్..మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను 563 మిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన 505 మిలియన్ డాలర్లతో పోలిస్తే 11.48 శాతం అధికం. సంస్థ భారత్ నుంచి కార్యకలాపాలు చేపడుతున్నది. ముఖ్యంగా మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం ఇక్కడి నుంచే పనిచేస్తుండటం విశేషం. కాగ్నిజెంట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది భారత్‌లో 50 వేల మంది ఫ్రెషర్లను క్యాంపస్‌ల ద్వారా తీసుకోనున్నట్లు ప్రకటించింది. అలాగే 2022లో 20 బిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తున్నది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.65 శాతం పెరిగి 4.82 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయంలో డిజిటల్ సేవల్లో 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ప్రస్తుతం సంస్థకు అంతర్జాతీయంగా 3.40 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో భారత్‌లోనే 2.40 లక్షల మంది ఉండటం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Cognizant
- India
- IT services
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

