Cognizant | న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ గుర్రుమన్నది. వాణిజ్య రహస్యాలు బహిర్గతం చేసినందుకుగాను ఇన్ఫోసిస్‌పై అమెరికా ఫెడరల్ కోర్టులో కాగ్నిజెంట్ దావా దాఖలు చేసింది. వాణిజ్య రహస్యాలతోపాటు హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి కీలక అంశాలు బయటకు పొక్కడాన్ని కాగ్నిజెంట్ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. కాగ్నిజెంట్ ఆరోపణలను ఇన్ఫోసిస్ కొట్టిపారేసింది. ఈ విషయంపై కోర్టులో తాడోపేడో తెల్చుకుంటామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి
విక్రయదారులకు అమెజాన్ ఊరట
ముంబై, ఆగస్టు 24: విక్రయదారులకు అమెజాన్ శుభవార్తను అందించింది. వారి ఉత్పత్తులపై విధిస్తున్న ఫీజు ను 12 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పండుగ సీజన్లో మరిన్ని ఉత్పత్తులను విక్రయించేందుకు అవకాశం కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన ఫీజు వచ్చే నెల 9 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయా ఉత్పత్తులను బట్టి విక్రయ ఫీజును 3-12 శాతం వరకు వసూలు చేయనున్నది. దీంతో రూ.500 లోపు ధర కలిగిన ఉత్పత్తుల ను విక్రయించేవారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగనున్నాయని అమెజాన్ ఇండియా డైరెక్టర్ అమిత్ నందా తెలిపా రు. ఈ ఫీజు తగ్గింపు పండుగ సీజన్‌కు అనుకూలంగా ఉంటున్నప్పటికీ ఇది తాత్కాలికం కాదని కంపెనీ పేర్కొంది.