న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కాగ్నిజెంట్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ) హెడ్‌గా శైలజా జోస్యుల నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన శైలజకు టెక్నాలజీ రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. 2018 నుంచి 2024 మధ్యకాలంలో ఈవైలో విధులు నిర్వహించిన శైలజ..తిరిగి కాగ్నిజెంట్‌లో చేరారు.
ఇప్పటికే హైదరాబాద్ సెంటర్ హెడ్గాను, బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ హెడ్గాను విధులు నిర్వహించారు కూడా. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ సౌర్య గుమ్మడి మాట్లాడుతూ..టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం ఉన్న శైలజ అనుభవాలు తమ జీసీసీ విస్తరణకు దోహదం చేయనున్నాయన్నారు.