న్యూఢిల్లీ, మార్చి 14: ఫ్రెంచ్ వాహనాల ఉత్పత్తి సంస్థ సిట్రాయిన్.. భారత్‌లో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 58 అవుట్లెట్లు ఉండగా, ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 200కి పెంచుకోవాలని చూస్తున్నది. దేశవ్యాప్తంగా కంపెనీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో షోరూంల సంఖ్య ను మూడింతలు పెంచుతున్నట్లు సిట్రాయిన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా తెలిపారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో షోరూంలను ఏర్పాటు చేసినట్లు, ఇక నుంచి గ్రామీణ, చిన్న స్థాయి నగరాలపై దృష్టి సారించనున్నట్లు చెప్పా రు.