Citroen C3 Aircross | ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) భారత్ మార్కెట్లోకి విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది. పాత మోడల్ కార్లను రీఫ్రెష్ చేస్తూ, కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి తేవడానికి సిద్ధమవుతున్నది. ఈ దశలో తన సేల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి సెవెన్ సీటర్ ఎస్యూవీ సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ (Citroen C3 Aircross) కార్ల విక్రయాలు పెంచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది.
సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ (Citroen C3 Aircross) కారు ధర రూ.9.99 లక్షల నుంచి రూ.14.33 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. సేల్స్ పెంచుకోవడానికి ఈ కారులో సెలెక్టెడ్ వేరియంట్లపై రూ.2.62 లక్షల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. ‘యు’, ‘ప్లస్’, ‘మ్యాక్స్’ ట్రిమ్ కార్లపై రూ.2.62 లక్షల రాయితీ అందిస్తున్నది. అయితే పరిమిత యూనిట్లపై మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్తో సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ (Citroen C3 Aircross) కారు రూ.8.99 లక్షల నుంచి రూ.11.61 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.
సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ (Citroen C3 Aircross) ప్లస్ వేరియంట్ ఫైవ్ సీట్స్, సెవెన్ సీట్స్ వేరియంట్లుగా వస్తున్నది. ఈ కారు డ్యుయల్ టోన్ ఇంటీరియర్స్, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ ప్లే, ఆండాయిడ్ ఆటో, వైర్ లెస్ కనెక్టివిటీ, మై సిట్రోన్ కనెక్ట్ యాప్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, టిల్ట్ స్టీరింగ్, రేర్ డీఫాగర్ వంటి ఫీచర్లతో కూడిన 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.
సేఫ్టీ కోసం కారులోని ప్రయాణికులు, డ్రైవర్ లకూ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, రేర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి.
సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ (Citroen C3 Aircross) కారులో 1.2 లీటర్ల త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటది. ఈ ఇంజిన్ గరిష్టంగా 108 బీహెచ్పీ పవర్, విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిసన్ ఆప్షన్ గల కారు ఇంజిన్ 190 ఎన్ఎం టార్క్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ గల ఇంజిన్ 205 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.