ఖైరతాబాద్, జూలై 8: ప్రభుత్వం సహకరిస్తే దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తి కేంద్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో ప్రారంభిస్తామని సదరన్ సిలికాన్ టెక్నాలజీ కంపెనీ డైరెక్టర్లు హర్ష్ మాలు, తాహెర్ అలీ తెలిపారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సెమీకండక్టర్లలో వినియోగించే పలుగు రాళ్లు (క్వార్టజ్) ఖనిజం మన దేశంలో పుష్కలంగా లభిస్తున్నప్పటికీ దీనిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని, ఈ టెక్నాలజీ ఇక్కడ లేకపోవడంతో ముడిసరుకును చైనాకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు.
పాలక ప్రభుత్వాలు సహకరిస్తే తెలుగు రాష్ర్టాల్లోనే చిప్ తయారు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.