Vice President : బీజేపీ సీనియర్ నాయకుడు (BJP senior leader), మాజీ ఎంపీ (Ex MP) విజయ్ కుమార్ మల్హోత్రా (Vijay Kumar Malhotra) మృతికి ఉపరాష్ట్రపతి (Vice President) సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) సంతాపం తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం మల్హోత్రా నివాసానికి వెళ్లి, ఆయన పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.
94 ఏండ్ల విజయ్ మల్హోత్రా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తున్నారు. విజయ్ కుమార్ మల్హోత్రా.. ఐదుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు.
రెండుసార్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. మల్హోత్ర మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం మల్హోత్ర చేసిన సేవలను పలువురు గుర్తుచేసుకున్నారు.
#WATCH | Delhi: Vice President CP Radhakrishnan arrived at the residence of senior BJP leader Vijay Kumar Malhotra to pay her last respects.
Vijay Kumar Malhotra passed away at AIIMS, New Delhi, today at the age of 93. pic.twitter.com/bS5cNwvNod
— ANI (@ANI) September 30, 2025