నూఢిల్లీ, మార్చి 15: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సిరీస్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. 15 సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్న ఈ ఫోన్లు అడ్వాన్స్డ్ కెమెరా స్మార్ట్ఫోన్లతో తీర్చిదిద్దింది. వీటిలో షియోమీ 15 ధర రూ.64, 999గా నిర్ణయించిన సంస్థ.. షియోమీ 15 అల్ట్రా మాడల్ ధర రూ.1,09,999కి విక్రయిస్తున్నది. ఈ రెండు ఫోన్లు అమెజాన్‌లో వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. 6.36 అంగుళాల క్రైస్టాల్రేస్ డైనమిక్ 1-120 అమోలెడ్ టచ్‌స్క్రీన్‌తో తయారు చేసిన ఈ ఫోన్లో 14 ఎంఎం నుంచి 120 ఎంఎం ఫోకల్ లెంథ్‌తో మూడు కెమెరాలు, 50 మెగాపిక్సెల్ లైకాకెమెరా, 5240 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 19 నుంచి ముందస్తు బుకింగ్‌లు ఆరంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఇంకా చదవల్సిన వార్తలు
ఈ-కామర్స్ దిగ్గజాలకు షాక్
న్యూఢిల్లీ, మార్చి 15: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలకు బీఐఎస్ షాకిచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు చెందిన గిడ్డంగులపై దాడులు చేసి..వేలాది సంఖ్యలో ధృవీకరించబడని వినియోదారుల ఉత్పత్తులను సీజ్ చేసినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 7న లక్నోలోని అమెజాన్ గిడ్డంగుల్లో తనిఖీ చేసి 215 టాయ్స్, 24 హ్యాండ్ బ్లెండర్ల ఉత్పత్తులను సీజ్ చేసింది. అలాగే ఢిల్లీలో అమెజాన్‌కు ఉన్న గిడ్డంగిలో 58 అల్యూమినియం రేకులు, 34 మెటాలిక్స్ వాటర్‌బాటిళ్లు, 25 ఆటబొమ్మలు, 20 హ్యాండ్ బ్లెండర్లు, 7 పీవీసీ కేబుల్స్, 2 ఫుడ్ మిక్సర్లు, 1 స్పీకర్లు సీల్ చేసింది. వీటికి సంబంధించి ఎలాంటి కాగితాలు లేవని బీఐఎస్ గుర్తించింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగిలో 534 స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్, 134 ఆటబొమ్మలు, 41 స్పీకర్లు సీల్ చేసినట్లు బీఐఎస్ వర్గాలు వెల్లడించాయి.