న్యూఢిల్లీ, జూలై 23: స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు అడ్డుకట్టతోపాటు టెలికం మౌలిక సదుపాయాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు టెలికం రంగ రెగ్యులేటర్ ట్రాయ్.. ఆయా రంగాల రెగ్యులేటర్లతో తాజాగా సమావేశమైంది. ఈ జాయింట్ కమిటీ మీటింగ్‌లో ఆర్బీఐ, సెబీ, టెలికం శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్-ఐటీ మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిజిటల్ సమ్మతి సేకరణపై ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లోని సంస్థల నుంచి వస్తున్న అన్ని వాణిజ్య కాల్స్ కోసం 1600-సిరీస్‌కు అత్యవసరంగా పరివర్తన అవసరమని జాయింట్ కమిటీ రెగ్యులేటర్లు నిర్ణయించారు. వివిధ కంపెనీల కార్యకలాపాల ఆధారంగా దశలవారీగా దీన్ని పూర్తిచేయాలని చూస్తున్నారు.